మత్తుతో జీవితాలు చిత్తు..!
– దుర అలవాట్లకు దూరంగా ఉండాలి
– పిల్లల భద్రత డ్రగ్స్‌కు అడ్డుకట్టపై అవగాహాన
– తాండూరులో పాల్గొన్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మత్తుతో జీవితాలు చిత్తు అయ్యే ప్రమాదం ఉంటుందని, విద్యార్థులు, యువత అలాంటి దుర అలవాట్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలతో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలతో మేరకు శుక్రవారం తాండూరులో పిల్లల భద్రత డ్రగ్స్‌కు అడ్డుకట్ట అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాండూరు పట్టణ పోలీసు శాఖ, ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్, మండల పరిషత్ శాఖల ఆధ్వర్యంలో తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని పాఠశాలలో, పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఈగల్ ఫోర్స్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ రాణి, తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాల అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. వాటికి బానిసలైతే జీవితాలు చిత్తు అయిపోతాయని అన్నారు. డ్రగ్స్ వినియోగిస్తే జీవితాలు రోడ్డు పాలు అవుతాయన్నారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కోల్పోతారని అన్నారు. కావున వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఎవరైనా మత్తు పదార్థాలపై అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే నార్కోటిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1908కు లేదా 8712671111కు వాట్సాఫ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ అంబర్య, ఎంఈఓ వెంకటయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, స్వచ్చంద సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


