పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు
– ఉచిత ఎంసెట్ శిక్షణ తరగతులు అభినందనీయం
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టుదతో చదివితే ఎలాంటి విజయాన్ని అయినా సాధించవచ్చని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరు పట్టణం భాష్యం కాలేజీలో సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో బాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉచిత ఎప్సెట్(ఎంసెట్) శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంటర్ తరువాత చదివే కోర్సులు కీలక మలుపులాంటివని తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఎలాంటి విజయాన్ని అయినా సాధించవచ్చని అన్నారు. శిక్షణ శిబిరంలో చెప్పిన విషయాలను ఇంటికి వెళ్లిన తరువాత కూడా ప్రశాంత వాతావరణంలో మననం చేసుకోవాలన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. ఇతర వ్యవహారాలను కూడా పట్టించుకోరాదని అన్నారు. సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని, వారి సేవను అభినందించారు. బాలికలు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

గుణాత్మక విద్య అందించడమే లక్ష్యం