గుణాత్మక విద్య అందించడమే లక్ష్యం
– ఆపిల్ కిడ్స్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
– ఆపిల్ కిడ్స్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం షావుకార్పేట్ లోని ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి పట్టాలను (సర్టిఫికెట్స్) అందజేశారు. విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్లే గ్రూప్ నుంచే విద్యార్థులకు ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు. మేధావుల అభిప్రాయాల అనుగుణంగా చిన్నారుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యను వ్యాపారంగా కాకుండా సేవాభావంతో, సమాజంలో మంచి ఉన్నతమైన వ్యక్తులుగా నేటి తరంను తయారు చేసేందుకు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వనజ, టీచర్లు హారిక, సుష్మ, భార్గవి ఉన్నారు.

ఇదికూడా చదవండి…

