విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి
– విద్యారంగం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రాధాన్యం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా సింధూ డిగ్రీ కాలేజీ వార్షికోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం తులసీ గార్డెన్ లో స్థానిక సింధూ డిగ్రీ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదవుతోనే గుర్తింపు లభిస్తుందని అన్నారు.

విద్యార్థులు, యువత వారి భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టిసారించాలని సూచించారు. వారు ఎంచుకున్న అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తాండూరు నియోజకవర్గానికి ఐటీఐ కాలేజీ, ఇంటిగ్రేడేట్ స్కూళ్లను మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపల్ విజయాదేవి రంగారావు మాట్లాడుతూ తమ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థుల సహాకారం, అధ్యాపకుల కృషితో సింధూ కాలేజీ టాప్ టెన్ కాలేజీలో చోటు దక్కించుకుంటుందని అన్నారు. మరోవైపు కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో అదరగొట్టారు. ఆట పాటలతో ఉత్సాహాంగా గడిపారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సంగీత, డిగ్రీ కాలేజీ వైస్ ప్రన్సిపల్ అమరేందర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

