నర్సింగ్ కాలేజీకి పరిహారం చిక్కులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నర్సింగ్ కాలేజీకి పరిహారం చిక్కులు..!
– భూమి ఎక్కువ.. పరిహరం తక్కువైందన్న బాధితులు
– కాలేజీ భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీకి పరిహారం చిక్కులు వచ్చిపడ్డాయి. కళాశాల కోసం భూములు ఇచ్చిన బాధితులు తమకు భూములు ఎక్కువ తీసుకుని.. పరిహారం తక్కువగా అందజే శారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సర్వేనెంబర్ 52/7లో నర్సింగ్ కాలేజీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 44వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాలేజీని నిర్మిస్తున్నారు. కాలేజీ నిర్మాణం గత ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేయగా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భూములు కోల్పోయిన బాధితులకు కొంత పరిహారం చెల్లించారు. తాజాగా శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ కోసం 3 ఎకరాల భూమిని కోల్పోయిన కేతావత్ మల్కిబాయి, కేరీబాయి కుటుం సభ్యులకు ప్రభుత్వం రూ. 54లక్షల చెక్కులను అందజేశారు.

అయితే వారు కాలేజీ కోసం తమకు చెందిన భూమిని పెద్ద మొత్తంలో తీసుకుని పరిహారం తక్కువగా అందజేశారని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. దీంతో సమస్యను పరిష్కరించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కోరారు. శనివారం సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీని సందర్శించారు. ఇంజనీర్ భీంసేన్ రావు, రమేష్, సర్వేయర్లతో భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన భూముల వి వరాలను కూడా ఆరా తీశారు. బాధితుల ఇచ్చిన భూములను సర్వే చేసి నివేధిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదికూడా చదవండి…

తిరంగా.. దేశభక్తి ఉప్పొంగంగా..!