జోహార్ అంబేద్కర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జోహార్ అంబేద్కర్..!
– తాండూరులో ఘనంగా జయంతి
– నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ జయంతి తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పాత తాండూరు అంబేద్కర్ పార్కులోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.

పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డా. సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్లు నీరజా బాల్ రెడ్డి, సోమశేఖర్, నాయకులు రంగారావు, పి. బస్వరాజ్, గాజుల మాధవి, మాల మహనాడు నాయకులు కృష్ణ, కృష్ణయ్య, జిలాని, కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

ఐస్.. డ్రింక్‌తో ఆరోగ్యం తుస్సు..!