ఐస్.. డ్రింక్‌తో ఆరోగ్యం తుస్సు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఐస్.. డ్రింక్‌తో ఆరోగ్యం తుస్సు..!
– ఎన్నిరోగాలు వస్తాయో తెలుసా
దర్శిని డెస్క్ : వేసవిలో తాపాన్ని తీర్చుకునేందుకు ప్రజలు శీతల పానియాలను ఆశ్రయిస్తారు. కూల్‌ డ్రింక్స్ తో పాటు ఐస్‌ వేసినా చెరుకు రసం, పండ్ల రసాలు తాగుతుంటారు. ఇలా ఐస్‌ వేసిన పానీయాలు తాగడం వల్ల ఎండ వేడికి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఉపశమనం కోసం తాగే శీతల పానీయాలు, బయట తాగే పండ్ల రసాల వల్ల కూడా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆసుపత్రికి వస్తున్న బాధితులను చూస్తే తెలుస్తోంది. పిల్లలు, వృద్ధులు వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వామ్మో ఇన్ని రోగాలా…
వేసవిలో పళ్ల రసాలు ఎక్కువ విక్రయమవుతాయి. వీటిలో ఉపయోగించే ఐస్‌ గడ్డలు చాలా సందర్భాల్లో కాలుష్య పూరితంగా ఉంటున్నాయి. బ్యాక్టీరియా, వైరస్‌లు… మలబద్దకం, విరేచనాలు, పేగు సంక్రమణలు, టైఫాయిడ్, డయేరియా, హెపటైటిస్‌-ఎ వంటి వ్యాధులకు కారణమవుతాయి. కొందరు త్వరగా గడ్డ కట్టేందుకు హానికరమైన రసాయనాలు వినియోగిస్తారు. దీంతో మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ఐస్‌ చప్పరించడం వల్ల పళ్ల కవళికలు దెబ్బతింటాయి. పళ్లు బలహీనపడటం, నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. జీర్ణ వ్యవస్థకు సహాయపడే సహజ రసాయనాలు, నూట్రీయెంట్స్‌ అంతగా లభించవు. శరీరానికి పోషకాలు సైతం పూర్తిగా అందవు. గొంతునొప్పి, ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. వృద్ధులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. వీలున్నంత వరకు ఇళ్లలో తయారు చేసే రసాలను మాత్రమే తాగాలి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీములు అతిగా తీసుకోకూడదు.

ఇది కూడా చదవండి….

అర్దరాత్రి.. పసికందుకు సీపీఆర్..!