దాహార్తి తీర్చడం అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– గంజ్‌లో కట్కం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

తాండూరు పట్టణంకు చెందిన ప్రముఖ వ్యాపారి కట్కం వీరయ్య స్మారకార్థం వారి కుమారులు కట్కం తిమ్మయ్య, కట్కం వీరేందర్ ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగానే వేసవి సందర్భంగా నేహ్రు గంజ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారుల, రైతుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన సంఘం సభ్యులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

