అనుబంధాలకు ఆత్మీయ రక్ష
– ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి రాఖీ కట్టిన సోదరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాలకు రాఖీ ఆత్మీయ రక్షణగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి రాఖీ పౌర్ణమి సందర్భంగో ఓ సోదరి రాఖీ కట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ
హిందూ సంప్రదాయాలను, విశిష్టతలను తెలిపే రాఖీ పండగకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లకు సోదరభావంతో కట్టే రాఖీలతో ఆత్మీయ బంధాలు పెంపొందుతాయన్నారు. అదేవిధంగా నియోజకవర్గ సోదర సోదరీమణులందరికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను తెలిపారు.
