తాండూరులో తూకం యంత్రాల తనిఖీలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో తూకం యంత్రాల తనిఖీలు..!
– స్వర్ణకారులకు చెందిన మిషన్ల పరిశీలన
– సీలింగ్, చెకింగ్, స్థాపింగ్ చేసిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సర్ణకారులు తూకం యంత్రాలను జిల్లా తూనికల, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా అధికారి ఆదేశాల మేరకు బుధవారం తాండూరు పట్టణంలో అధికారులు ఒకరోజు శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధికారి రియాజ్ హైమద్ ఖాన్ పర్యవేక్షణలో సిబ్బంది తాండూరు పట్టణంలోని జువెల్లర్స్ షాపులలో ఉండే తూకం యంత్రాలను పరిశీలించారు. మొత్తం 53 యంత్రాలను పరిశీలించి సీలింగ్, చెకింగ్, స్థాపింగ్ చేసి సర్టిఫైడ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ స్వర్ణకారులు ప్రతి యేడాది తమ యంత్రాలను సీలింగ్, చెకింగ్, స్థాపిండ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఇందులో భాగంగా తాండూరులో ఒక రోజు శిభిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో ఏదైనా మిషన్ ఫేయిల్ అని తేలితే రిపేర్ చేసుకోవాలని కంపెనీకి పంపిస్తామన్నారు. దీంతో పాటు తూకం యంత్రాల మోసాల పై దృష్టిసారించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా తూకాలలో మోసాలకు పాల్పడితే జరిమాన విధిస్తామని, మళ్లీ అదే మోసం చేస్తే ప్రాసిక్యూట్ చె స్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెనాహీద్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు