దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పోటీ మహారాజ్ దేవాలయ కమిటి ప్రమాణ స్వీకారం
– శుభకాంక్షలు తెలిపిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవాలయాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పోటీ మహరాజ్ దేవాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో దేవాలయ చైర్మన్ గా ప్రసాద్ గౌడ్, సభ్యులుగా ఎస్. రాజ్ కుమార్, ఎ.నవీన్ కుమార్, ఎ. జగన్నాథ్, ఎన్. సిద్దమ్మ, కె. శ్రీనివాస్, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా కె. అనంత్ భట్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ పాలకవర్గం దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దేవాలయ అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామన్నారు.

ఈకార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ కౌన్సిలర్ విజయాదేవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కాంగ్రెస్ నాయకులు డా. సంపత్ కుమార్, దేవాలయాల చైర్మన్లు పటేల్ కిరణ్ కుమార్. పి. బస్వరాజ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సోమ శేఖర్, ఈఓ తాడెం నరేందర్, నేతలు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు దేవాలయ నూతన పాలకవర్గ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి….

సార్.. నా హెలీకాప్టర్ ఎగుర్తలేదు..!