రేపే టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్..!
– ముహుర్తం ఖరారు చేసిన విద్యాశాఖ
– విడుదల చేసే టైమింగ్ ఇదే…
– ఫలితాలు ఎలా చూసుకోవాలంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షల ఫలితాల విడుదలకు విద్యా శాఖ ముహుర్తం ఖరారు చేసింది. బుధవారం (ఏప్రిల్ 30)వ తేదీన ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడికానున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం (ఏప్రిల్ 30) అధికారికంగా ప్రకటించింది.

ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్ధులకు మార్కులను మంజూరు చేయనున్నారు. మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు. ఈసారి జీపీఏ విధానం పూర్తిగా తొలగించిన సర్కార్ ఈ మేరక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా పరీక్షల్లో వచ్చి మార్కులు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, సబ్జెక్టు వారీ గ్రేడ్లు పొందుపరుస్తారు. అలాగే మార్కుల మెమోలపై పాస్ లేదా ఫెయిల్ అని కూడా ముద్రించనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ చెక్ చేసుకోవచ్చు.


