హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపరాదు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపరాదు
– దిశ క్లీనికల్ సర్వీసెస్ అధికారి రమేష్
– తాండూరులో అంతర్జాతీయ స్మారక దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపరాదని, వారిని అందరితో సమానంగా చూడాలని దిశ క్లీనికల్ సర్వీసెస్ ఆఫీసర్ జీ.రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిస్ట్రిక్ ఇంటిగ్రేటేడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవీ(దిశ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ హెచ్ఐవీ బాధితుల స్మారక దినోత్సవం నిర్వహించారు.

ఇందులో భాగంగా పట్టణంలోని జిల్లా ఆసుపత్రి నుంచి చౌరస్తా వరకు కొవ్వొత్తులతో స్మారక ర్యాలీ నిర్వహించారు. మనం గుర్తుంచుకుందాం, మనం లేచి నిలుస్తాం, మనం మార్గదర్శకులు అవుదాం అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దిశ క్లీనికల్ సర్వీసెస్ అధికారి రమేష్ మాట్లాడుతూ హెచ్ఐవీ ఉన్న వారి పట్ల వివక్ష చూపరాదని అన్నారు. వారిని కూడా అందరితో సమానంగా చూడాలని అన్నారు. వారి హక్కులను రక్షించి.. భవిష్యత్తుకు భంగం కలగచూడాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిల్లోని ఏఆర్టీ సెంటర్లో ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ ప్రతినిధులు, ఆసుపత్రి వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి…

భక్తిభావం అలవర్చుకోవాలి