గుండెపోటుతో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
– కుటుంబాన్ని పరామర్శించిన అధికారులు, సిబ్బంది
– అంత్యక్రియలకు ప్రభుత్వం తరుపున సాయం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎక్సైజ్ పోలీస్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందారు. కుటుంబాన్ని తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నాగర్ కర్నూల్ కు చెందిన శ్రీనివాస్ తాండూరు ఎక్సైజ్ పోలీస్టేషన్ లో మూడు సంవత్సరాలుగా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లిన శ్రీనివాస్ మంగళవారం తాండూరుకు రావాల్సి ఉంది. ఉదయం బయల్దేరుతుండగా శ్రీనివాస్ కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంభీకులు మృతదేహాన్ని నివాసానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు ఎక్సైజ్ అధికారులు మృతుని కుటుంబాన్ని పరామరి ్శంచారు. శ్రీనివాస్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రంగారెడ్డి డీ, వికారారాబాద్ ఈఎస్ ఆదేశాల మేరకు కుటుంబానికి ప్రభుత్వం తరుపున అంత్యక్రియల కోసం రూ.30వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ యూనియన్ నాయకులు రాజిరెడ్డి, అనంత్ రెడ్డి, నేతలు ఎల్. మురళీ, బాలరాజు, దామల నాయక్ తదిరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

