చదువుపై శ్రద్ధతోనే లక్ష్యాల సాధింపు
– విద్యార్థులు ఉత్తమ ఫలితాలపై దృష్టిసారించాలి
– తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
– ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుపై శ్రద్ధ పెడితే ఉన్నత లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరై ఇంటర్ మీడియట్ నోడల్ ఆఫీసర్ తో కలిసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల జీవితాలను మార్చేది చదువు ఒక్కటే అని అన్నారు. విద్యార్థులు తాము లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు.

చదువుపై దృష్టిసారించి ఆ లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. అదేవిధంగా ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాధించి కాలేజీకి గుర్తింపు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప, అద్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

