గణపయ్య పండగ.. మదినిండుగా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గణపయ్య పండగ.. మదినిండుగా..!
– గల్లీ గల్లీలో గణనాథుల వైభోగం
– దర్శించుకుంటున్న నేతలు, అధికారులు
– మండపాల వద్ద భక్తులకు అన్నదానాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలో గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు ఘనమైన పూజలు అందుకుంటున్నారు. వరుసగా రెండో రోజు గురువారం ఉదయం, సాయంత్రం పట్టణ భక్తులు మండపాల్లో కొలువుదీరిన గణేషున్ని పూజించారు.
kvcs
గల్లీలో ప్రతిష్టించిన వినాయకులను ప్రజా ప్రతినిధులు, అధికారులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా మండలపాల వద్ద మధ్యాహ్నం, రాత్రి అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. గణనాథుల పూజలతో, అన్నదానాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లిరిసింది.

పట్టణంలోని గుమాస్తానగర్‌లో జయశంకర్ ఉత్సక కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని స్థానిక భక్తులు శేషాద్రి, స్వాతి, సురేంద్ర, పల్లవి, రవి, అంజలి, ఆనంద్, సరిత దంపతులు, వారి కుటుంబ సమేతంగా పూజలో నిర్వహించారు. పూలు, పండ్లతో పాటు ఉండ్రాళ్లు, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

మరోవైపు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఇందిరానగర్‌లో ప్రతిష్టించిన వినాయక మండపాన్ని సందర్శించారు. గణేషునికి స్థానిక భక్తులు, మండప నిర్వహకులతో పాటు విద్యార్థులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చవితి ఉత్సవాల్లో కాలనీలో సందడి నెలకొంది.


ఇదికూడా చదవండి…

మారని మందుబాబులు..!