బీసీల రిజర్వేషన్ తరువాతే ఎన్నికలు నిర్వహించాలి
– బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్
– బషీరాబాద్ మండల కమిటీ ఎన్నిక, నియామకాల అదజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఆదివారం బషీరాబాద్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షునిగా షేక్ షేబాజ్, బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షుడిగా మున్నూరు లక్ష్మయ్య, తాండూర్ నియోజకవర్గ యువజన సంఘం కార్యనిర్వాక అధ్యక్షునిగా మధుసూదన్ గౌడ్, బీసీ యువజన సంఘం తాండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా వడ్డే జగదీష్ లను ఎన్నుకోవడం కున్నారు. ఈడిగ శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఉంచుతామని ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అలాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అనిల్, మొగులప్ప, నరేష్, రాజు నాయక్, గోపాల్ ,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

