ఏడుగురి పేకాట రాయుళ్ల అరెస్టు
– రూ. 12 వేలు, 7 సెల్ ఫోన్లు స్వాదీనం
– వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిషేధిత పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను తాండూరు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో తాండూరు మండలం దస్తగిరి పేట్ గ్రామ పరిధిలోని మైసమ్మ దేవాలయం వద్ద గ్రామానికి చెందిన పురుషోత్తం, ఆంజనేయులు, భీమప్ప, శ్రీనివాస్, వెంకటేశం, సాధిక్, దస్తప్పలు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.12.210లు, 7 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి…

