
బీఎస్ఆర్ ఇంట వరలక్ష్మీ శోభ
– భక్తిశ్రద్దలతో వ్రత పూజలు
– పూజలు చేసిన శ్రీనివాస్ రెడ్డి దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో వరలక్ష్మీ వ్రతం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. బుయ్యని సరళా రెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దంపతులు లక్ష్మీదేవికి వేదపండితు సుమన్ పంతులు మంత్రోచ్చరణల మద్య పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సరళా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ వరలక్ష్మీ మాత ఆశీస్సులతో అందరికి మంచే జరగాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ పూజలలో భావిగి భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, కాంగ్రెస్ యువ నాయకులు వికాస్ జోషి, విష్ణు, కోట్ల రాజు, సంజీవరావు, తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇదికూడా చదవండి…

