వర్షాలు తీవ్ర రూపం..!
– జిల్లాలపై వరణుడి విశ్వరూపమే..
– ఆయా జిల్లాలకు అరెంజ్ అలర్ట్
– వాతావరణ శాఖ ప్రకటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వరణుడు విశ్వరూపం చూపించేస్తున్నాడు. భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఏపీ సముద్ర తీరానికి సమీపంలో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని.. దాని ప్రభావంతోనే రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఆగస్టు 13వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదే సమయంలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆగస్టు 14న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఏండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అధికార యంత్రాన్ని సన్నద్దం చేస్తోంది.

ఇదికూడా చదవండి…

