తేలిన పల్లె పోరు లెక్క..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తేలిన పల్లె పోరు లెక్క..!
– సర్పంచులు, వార్డు సభ్యుల అభ్యుర్థుల జాబితా ఖరారు
– నామినేషన్ల పరిశీలిన తరువాత లిస్టు రిలీజ్
– జిల్లాలో సర్పంచులు, వార్డు సభ్యులు ఎంతమంది అంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో పల్లె పోరు అభ్యర్థులను ఖరారు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచు అభ్యర్థులుగా, వార్డు సభ్యులుగా ఆశావాహులు నామినేషన్లు సమర్పించారు.

వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోడంగల్, దౌల్తాబాద్, బొంరాస్ పేట్, దుద్యాల మండలాల్లో 262 పంచాయతీలు, 2179 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈనెల 27 నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. నామినేషన్ల పరిశీలన తరువాత జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో సర్పంచులుగా,వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

తాండూరు మండలంలో 33 పంచాయతీలకు గాను సర్పంచ్ అభ్యర్థులుగా 149 మంది, 290 వార్డు సభ్యులకు 569 మంది, బషీరాబాద్ మండలంలో 39 పంచాయతీలకు గాను సర్పంచ్ అభ్యర్థులుగా 195మంది, 312 వార్డు సభ్యులకు 607 మంది, యాలాల మండలంలో 39 పంచాయతీలకు గాను సర్పంచ్ అభ్యర్థులుగా 160 మంది, 318 వార్డు సభ్యులకు 600 మంది, పెద్దేముల్ మండలంలో 38 పంచాయతీలకు గాను సర్పంచ్ అభ్యర్థులుగా 192 మంది, 308 వార్డు సభ్యులకు 655 మంది, కోడంగల్‌లో 25 పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా 123మంది, 222వార్డులకు 448 మంది, దౌల్తాబాద్‌లో 33పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా 148 మంది, 290వార్డులకు 569 మంది, బొంరాస్‌పేట్‌లో 35 పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా 143 మంది, 292వార్డులకు 523 మంది, దుద్యాల మండలంలో 20 పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా 106 మంది, 166వార్డులకు 340 మంది నామినేషన్లను ఆమోదించడం జరిగిందని ప్రకటించారు. అప్పీలు, విత్‌ డ్రాల తరువత అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేయడం జరుగుతుందని వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి