రాక పోకలకు బ్రేక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాక పోకలకు బ్రేక్..!
– మళ్లీ ఉప్పొంగిన బెల్కటూర్ వాగు
– మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో గ్రామాల మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది. ఆదివారం, సోమవారం మండలంలో భారీ వర్షాలు కురిశాయి.
kvcs
మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ఇండ్లకే పరిమతమయ్యారు. భారీ వర్షాల కారణంగా తాండూరు మండలం బెల్కటూర్ వాగు మళ్లీ ఉప్పొగింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన తాత్కాళిక రోడ్డు వేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు రోడ్డుకు కొట్టుకుపోయింది కూడా.

మళ్లీ కురిసిన భారీ వర్షాలతో బెల్కటూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో బెల్కటూర్ – కరణ్ కోట్ గ్రామాల మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది. అటు, ఇటు గ్రామాల ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. మరోవైపు తాండూరు మండలంలోని కొత్లాపూర్ వాగు కూడా ఉదృతంగా ప్రవహించింది. ఆదివారం రాత్రి రాకపోకలు స్థంభించాయి. రాకపోకలు స్తంభించడంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇదికూడా చదవండి…

వర్షాలు తీవ్ర రూపం..!