ముమ్మరంగా భద్రత తనిఖీలు

క్రైం తాండూరు రాజకీయం

ముమ్మరంగా భద్రత తనిఖీలు
– తాండూరు బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో బీడీ టీం సోదాలు
– ఎందుకోసమో.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు 

తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో బాంబ్ డిస్పోజల్(బీడీ) టీం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు శనివారం తాండూరు పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు ప్రార్థనా మందిరాలు, కల్వర్టులు తదితర ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికుల వద్ద బ్యాగులు, వస్తువులతో పాటు ఇతర ప్రాంతాల్లోని అనుమానిత వస్తువులను తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, అప్రమత్త చర్యలలో భాగంగా పోలీసు శాఖ తరుపున బీడీ టీంలతో తనిఖీలు చేపట్టడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా తాండూరులో బస్టాండ్, రైల్వే స్టేషన్‌, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ తనిఖీలో ఎలాంటి అవాంచనీయన, అనుమానిత సంఘటనలు కనిపించలేదని తెలిపారు. అదేవిధంగా ప్రజలు తమకు ఏదైనా అనుమానితంగా కనిపిస్తే, చోటు చేసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.