కరుణించు.. ఎల్లమ్మ తల్లీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కరుణించు.. ఎల్లమ్మ తల్లీ..!
– రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక అలంకరణ
– గంజ్‌ దేవాలయంకు శ్రావణ శోభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రుగంజ్‌లోని రేణుకా ఎల్లమ్మను కరుణించు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు.
kvcs
శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉదయం అమ్మవారికి అభిషేకము నిర్వహించారు. ఆలయ పూజారి అమ్రేష్ పంతులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.

శుక్రవారం సందర్భంగా దేవాలయానికి వచ్చన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం లలితా పారాయణం, రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు శ్రావణ మాసం భజన సమాప్తి నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. పూజలలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరారు.

ఇదికూడా చదవండి…

తాండూరు స్టోన్‌ మర్చంట్స్‌, క్వారీ ఓనర్స్‌కు ఎన్నికలు