ఎమ్మెల్సీల‌కు కేసీఆర్ అభినంద‌న

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఉమ్మ‌డి రంగారెడ్డి విజ‌యాలు ఆద‌ర్శం
– తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్
– ఎమ్మెల్సీలు మ‌హేంద‌రెడ్డి, శంబీపూర్‌ల‌కు అభినంద‌న
ఉమ్మ‌డి రంగారెడ్డి, ద‌ర్శిని ప్ర‌తినిధి: వివిధ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ, అభ్య‌ర్థులు సాధించే విజ‌యాలు రాష్ట్రానికి ఆద‌ర్శంగా నిలుస్తాయ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవ విజ‌యాలు సాధించిన ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, శంబీపూర్ రాజులు ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. చేవేళ్ల పార్ల‌మెంట్ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే లు కృష్ణారావు, వివేకానంద, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీలు నవీన్ రావు తదితరులతో కలిసి వారు సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలు మ‌హేంద‌ర్‌రెడ్డి, శంబీపూర్‌ల‌ను అభినందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విజయాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు.