మినుముల్లో పోషకాలు..!

ఆరోగ్యం జాతీయం తాండూరు తెలంగాణ రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

మినుముల్లో పోషకాలు..!
– గుండె ఆరోగ్యానికి రక్షణ
– ఎముకలను ఉక్కులా మార్చే శక్తి
దర్శిని డెస్క్ : ఇనుమంతా శక్తి అందించే మినుములు తింటే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు.. అనేక రోగాల నుంచి కాపాడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1, బీ3 తోపాటు.. కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మినుముల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెకు రక్షణ.. మినుముల్లో గుండె జబ్బులను నివారించే అద్బుతమైన గుణం ఉంది. ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణమని పరిశోధనల్లో తేలింది. అవి రక్తంలో వెలువడే చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ మంచిగా జరగడం వల్ల హృదయ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

kvcs

ఎముకలు.. మినుముల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఎముకలు బలంగా, ధృఢంగా మారడానికి దోహదపడతాయి. కావున ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారు మినుములను తినడం మంచింది.

జీర్ణక్రియ.. మినుములను నిత్యం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. మినుముల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.. కావున ఎవరైనా జీర్ణసమస్యలతో బాధపడుతుంటే.. మినుములను ఆహారంలో చేర్చితే ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు మలబద్దకం, ఉబ్బసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

డయాబెటిస్‌.. రక్తహీనత మినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మినుముల వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి.. డయాబెటిస్ సమస్య తలెత్తకుండా మినుములు సహకరిస్తాయి. అంతేకాకుండా రక్తహీనత సమస్యను కూడా నివారిస్తాయి.

మంటను తగ్గిస్తాయి.. మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. గాయాలు, నొప్పులతో బాధపడుతున్న వారికి మినుములతో తయారు చేసిన ఆహారం వడ్డిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వీటిలోని పోషకాల వల్ల చర్మ సౌందర్యం కూడా బాగా పెరుగుతుంది.

ఇదికూడా చదవండి…

 

సర్వరోగ నివారిణి ఈ ఆకు..!