దేశ,ధర్మ పరిరక్షణకు బీజేపీ కృషి
– బీజేపీ తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు
– తాండూరు మండలంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ సంబరాలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దేశ సంరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కృషి చేస్తుందని ఆ పార్టీ తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు అన్నారు. బుధవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాండూరు మండలం జినుగుర్తి గేటు వద్ద ఈ ఆవిర్భావ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ దేశభక్తితో పాటు దేశ సంరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ పరితపిస్తోందన్నారు. ప్రపంచలోనే అత్యధిక కార్యకర్తల బలం ఉన్న బీజేపీనే అని అన్నారు. మండలంలో పార్టీని మరింత విస్తరింపజేసి పటిష్టపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు నరేందర్ యాదవ్, కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు కాళ్ల సంజీవరెడ్డి, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు సూర్యకాంత్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, విజయ్ కుమార్, బీజేవైఎం ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సిద్దు, రమేష్. శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

