కించపరిచిన నీచులపై చర్యలు తీసుకోండి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కించపరిచిన నీచులపై చర్యలు తీసుకోండి
– సోషల్‌ మీడియాలో దుష్ర్పచారంపై దుర్మార్గం
– పట్టణ పోలీసులకు బీఆర్ఎస్, బీసీ సంఘం నేతల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన నేతలపై కించపరిచేలా వ్యవహరించిన నీచులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి విజయం కోసం కృషి చేసిన నేతలు, బీసం సంఘం నాయకులను కించపరిచేలా కొందరు అజ్ఞాత వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు పెడుతున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం రాత్రి తాండూరు పట్టణ పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు, బీసం సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే కోసం కష్టపడి పనిచేస్తే మింగుడు పడని వ్యక్తులు ఓర్వలేక దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో దుష్ర్పచారాలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. నాయకులు ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీసీ సంఘం నాయకులు టైలర్ రమేష్, శివయ్య, నరేందర్ బసవరాజ్, నరసింహ, నరేందర్ రెడ్డి, ఉప్పరి లింగప్ప, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!