నేడు మోస్తారు వర్షాలు..!
– వాతావరణ శాఖ ప్రకటన
హైదరాబాద, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన జారి చేసింది.

తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో సముద్రమత్తానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది.

దీని ప్రభావంతో ఈ రోజు (సెప్టెంబర్ 9) తెలంగాణ లోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇదికూడా చదవండి…

