మొగులప్ప కుటుంబానికి భరోసా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మొగులప్ప కుటుంబానికి భరోసా..!
– పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ప్రభుత్వం ద్వారా రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా
– చెట్టినాడు ఫ్యాక్టరీలో ఉద్యోగం, రైతు బీమా
– ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు అభయం
– దిడ్డి వాగు, బండల వాగు బ్రిడ్జీల నిర్మాణంకు ఆదేశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలోని దిడ్డివాగులో గల్లంతై మృతి చెందిన బొక్తంపల్లి మొగులప్ప కుటుంబానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భరోసా అందించారు. శుక్రవారం ఉదయం మొగులప్ప మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంగెంకలాన్ గ్రామానికి వెళ్లారు.
kvcs
డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, బీసీసెల్ జిల్లా నాయకులు ఉత్తమ్ చంద్ లతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మొగులప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరుపున కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి స్థానిక చెట్టినాడ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పిస్తామని, మొగులప్ప మృతి పట్ల రైతు బీమా మంజూరు చేసే విధంగా చూస్తామని అన్నారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లును కూడా కేటాయించేలా చూస్తామని భరోసా అందించారు.

మరోవైపు చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం ప్రతినిధులతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. గ్రామంలోని దిడ్డి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపటాలని ఆదేశించారు. అదేవిధంగా బండల వాగుపై కూడా బ్రిడ్జి పనులు ప్రారంభించేలా చేస్తామన్నారు. దీంతో పాటు మల్కాపూర్ సంగెంకలాన్ వరకు రోడ్డు నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభించి గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డె శ్రీనివాస్, రాందాస్, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, తాండూరు తహసీల్దార్ తారాసింగ్, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

విద్యార్థులతో సర్కారు చెలగాటం..!

ఇదికూడా చదవండి…