బెడిసిన ద‌ర్జా దొంగ‌తనం

టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

బెడిసిన ద‌ర్జా దొంగ‌తనం
– సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ‌
– వెంబ‌డించి వెన‌క్కి తెచ్చుకున్న ఓన‌ర్
హైద‌రాబాద్, ద‌ర్శిని బ్యూరో: సినిమాల్లో దొంగ‌తనాలు ఆస‌క్తిరేపుతాయి.. నిజ‌జీవితంలో దొంగ‌లు చేసిన దొంగ‌త‌నాలు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తాయి. అటు ఇటుగా అతి తెలివిప‌రులు చేసే దొంగ‌తనాలు న‌వ్వును తెప్పిస్తాయి. ఇలాంటి విడియోలు సీసీ కెమెరాల‌లో రికార్డు కావ‌డం.. వాటిని ఇంట‌ర్నెట్లో పెట్ట‌డంతో వైరల్ కావ‌డం ష‌రామాలులైంది. తాజాగా ఓ అతి తెలివి దొంగ పట్ట పగలే ఇంట్లో నుంచి సైకిల్ దొంగిలించాడు.. కానీ ఆ తర్వాత ఓనర్ చేసిన పనికి షాకయ్యాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఓ ఇంటి గేట్ ఓపెన్ చేసి ఉండడంతో ఓ దొంగ‌ ఎంతో దర్జాగా లోపలికి వెళ్లాడు. ఇంటి వ‌రండాలో పార్కింగ్ చేసి ఉన్న బైక్‌, సైకిల్‌పై క‌న్నేశాడు. కాసేపు అక్కడే ఉండి.. ఇంట్లో వాళ్లను నిషితంగా ప‌రిశీలించాడు. ఆ తర్వాత సైకిల్‏ను ఎంతో నిదానంగా.. దర్జాగా తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆ ఇంటి ఓనర్ దొంగ వెనకాల పరిగెత్తాడు. ఓనర్ రావడం చూసిన ఆ దొంగ పరిగెత్తగా.. చివరకు ఓనర్ చేతికి చిక్కాడు. ఆ దొంగను పట్టుకుని ఓనర్.. తన సైకిల్ తాను ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఘటన మొత్తం ఆ ఇంటి వారండాలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను మీమ్స్ మార్చేసి నెట్టింట్లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అతి తెలివి దొంగ.. మొదటి సారి దొంగతనం చేస్తున్నాడమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

https://www.instagram.com/tv/CWUyLWwjfo6/?utm_source=ig_web_copy_link