ఈ కుర్రాళ్లు గ్రేట్..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఈ కుర్రాళ్లు గ్రేట్..!
– వర్షానికి దెబ్బతిన్న రోడ్డుపై గుంతల పూడ్చివేత
– నర్సపూర్‌ యువకుల శ్రమదానినికి ఫిదా
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుర్రాళ్లు అంటే అల్లరి చిల్లరగా తిరుతారనే కాదు.. సామాజిక సేవకు తోడ్పాడుతారని తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కుర్రాళ్లు నిరూపించారు. నర్సాపూర్‌ గ్రామానికి చెందిన యువకులు శ్రమదానం మనసుదోచుకున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నర్సాపూర్ నుండి ఇంధూర్ మధ్యలో వాగు బ్రిడ్జి పెచ్చులు పోవడంతో గుంతలు పడి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇది గమనించిన నర్సాపూర్ గ్రామయువకులు ఆ గుంతలను పూడ్చడం జరిగింది. యువకులంతా చేయి చేయి కలిపి గంటల పాటు శ్రమించి రోడ్లుపై గుంతలు పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. దీంతో అటుగా వెళ్ళే ప్రయాణికులు ఆ గ్రామ యువకులను అభినందించారు.
kvcs
కుర్రాళ్ల సామాజిక సృహకు ఫిదా అయి.. గ్రేట్ యూత్ అనిపిచంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి కిరణ్ కుమార్ సాగర్, నరేందర్, మల్లేశం, నరేష్, అనిల్, ప్రశాంత్, నరేందర్, నాని, ధనుష్, ప్రవీణ్, అశోక్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

మాంసం విక్రయాలకు బ్రేక్..!