వృత్తికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలి
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
– గ్రూప్-1 ఉద్యోగులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆర్యవైశ్య ముద్దు బిడ్డలు వృత్తికి, సమాజానికి వన్నె తెచ్చే విధంగా పేరుతీసుకరావాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో గ్రూప్-1లో ఉద్యోగాలు సాధించిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా కోట్రిక విజయలక్ష్మీ స్వయంగా గ్రూప్-1లో డీఏఓగా ఉద్యోగం సాధించిన మేడిశెట్టి భంధవి, సీటీఓగా ఉద్యోగం సాధించిన గుబ్బ చందనలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ముద్దు బిడ్డలు ఉద్యోగంలో రాణించాలని అన్నారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే ఉద్యోగానికి, సమాజానికి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, ఆర్యవైశ్య, ఆర్యవైశ్య మహిళ సంఘం, యువజన సంఘం, సమాజం పెద్దలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

