బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం..!
– రిజర్వేషన్ల అమలు స్టే పై అనుమానాలు వద్దు
– ప్రతిపక్ష అసత్య ప్రచారాలను నమ్మొద్దు
– ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు.

ఈ విషయంపై ప్రతిపక్షాలు చేస్తోన్న అసత్య ప్రచరాలను నమ్మొద్దని అన్నారు. బీసీల రాజకీయ ప్రాధాన్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. హైకోర్టు వారు GO 9 పై ఇచ్చిన తాత్కాలిక స్టే ఉత్తర్వులు కేవలం ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపే ఉద్దేశ్యంతోనే జారీ చేయబడ్డాయని అన్నారు. దీనివల్ల ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిపై ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు.

బీసీ లకు తగిన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. న్యాయ పరమైన అడ్డంకులను, చిక్కులను తొలగించి బీసీలకు న్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయి ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. బీసీలకు నిజమైన న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. అందువల్ల ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల సంపూర్ణ నమ్మకం ఉంచండి అని అన్నారు.

ఇదికూడా చదవండి…

