క్యారేట్.. బెటర్..!
– అల్సర్ సమస్యకు చెక్
– పిత్తం, కఫం, మలబద్దకం దూరం
– ఈ చలికాలంలో మంచి ప్రయోజనాలు
దర్శిని డెస్క్ : చలికాలంలో క్యారెట్ జ్యూస్‌గా చేసుకుని తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. క్యారెట్ టేస్టీగా ఉండటమే కాదు.. దీనిలో పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్‌లో ఎ, సి, కె, బి విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నాయి. క్యారెట్‌తో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం తాగడం కుదరకపోతే, భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేశాక రెండు గంటల తర్వాత కూడా తాగవచ్చు.

క్యారెట్ జ్యూస్‌లో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్, టమాటా జ్యూస్, చీనీపండ్ల జ్యూస్‌ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయమవుతాయి.
కూల్.. కూల్ క్లైమెట్‌లో హాట్ హాట్ క్యారెట్ హల్వా తినడం అంటే.. చాలామందికి ఇష్టం. అంతేకాదు, క్యారెట్‌తో సలాడ్స్, సూప్‌లు, టెస్టీ కర్రీలు కూడా చేసుకోవచ్చు. చలికాలంలో క్యారెట్ జ్యూస్‌గా చేసుకుని తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా క్యారెట్ జ్యూస్‌లో బీటా-కెరోటిన్ అనే పదార్ధం సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది.

నిద్రలేమితో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ జ్యూస్ తీసుకోవటం వల్ల మీరు ఊహించని ఫలితం వుంటుంది. క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటే.. ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం, మలబద్దకం దూరమవుతాయి. క్యారెట్‌ను ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత కప్పు రసంలో చెంచా తేనెను కలిపి సేవిస్తే గుండెల్లో మంట మటుమాయం అవుతుంది. క్యారెట్ జ్యూస్ మహిళలల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పరగడుపున క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల దానిలోని పోషకాలు శరీరం బాగా గ్రహించబడతాయి. క్యారెట్ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)


