ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
– 30శాతం సిలబస్‌ను తగ్గించిన ఇంటర్ బోర్డు
– ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 70 శాతం బోధన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా 70 శాతం సిలబస్‌ను మాత్రమే బోధించడం జరుగుతుందని స్పష్టం చేసింది.

కరోనా నేపథ్యంలో తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 70 శాతం సిలబస్‌తోనే విద్యా సంవత్సరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక 70 శాతం సిలబస్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది కూడా విద్యా సంవత్సరాన్ని 70 శాతం సిలబస్‌తోనే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.
మరోసారి ప్రవేశాల గడువు పొడగింపు..
ఇక ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరో సారి పొడగించింది. ఇప్పటికే పలు సార్లు చివరి తేదీని పొడగించిన ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి ప్రవేశాల గడువును పెంచారు. కరోనా నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు

