బీరప్ప స్వామి వైభోగం..!
– భక్తిశ్రద్దలతో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు
– పూజలో పాల్గొన్న శంకర్ యాదవ్ దంపతులు
– రేపు దర్శించుకోనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న కురుమల ఆరాధ్య దైవం బీరప్ప స్వామి దేవాలయంలో స్వామి వారి వైభోగం విరాజిల్లుతోంది.

దేవాలయంలో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకుకుని ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన యజ్ఞం, యాగంలో తాండూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

దీంతో దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నిండుకుంది. రేపు దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై స్వామి వారిని దర్శించుకుంటారని కురుమ సంఘం తాండూరు డివిజన్ గౌరవాధ్యక్షులు, న్యాయవాది కె.గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ తల్లిదండ్రులు హన్మయ్య, పూజారి పాండు, కోహీర్ రాజు, కురవ జర్నప్ప, మనోహర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

