రేపు విద్యాసంస్థలకు సెలవు..!
– ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
– హాలీడే ఎందుకోసమంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రేపు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8న పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ముస్లింలు జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా సెలవును ప్రకటించింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు మసీదులను దీపాలతో అందంగా అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ పండగ రోజు ఇస్రా, మేరాజ్‌ల కథను మసీదుల్లో చెబుతుంటారు. ముస్లీంలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈ పండగ రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. అయితే దీనిని సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. రేపు సెలవు దినంగా ప్రకటన విడుదల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి.
ఇదికూడా చదవండి…

