తాండూరు దర్నాకు దిమ్మదిరిగే షాక్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు దర్నాకు దిమ్మదిరిగే షాక్..!
– పాల్గొన్న పలువురుపై పోలీసుల కేసులు
– ఆ ఒక్క తప్పు కారణంగా చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల రోడ్డు ప్రమాదంను నిరసిస్తూ తాండూరు డెవలప్‌ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన తాండూరు దర్నాకు స్థానిక పోలీసులు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. దర్నాలో పాల్గొన్న సుమారు 25 మందిపై కేసులు నమోదు చేశారు.

చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన సుమారు 13 మంది మృతి చెందడంతో తాండూరు డెవలప్‌ మెంట్ ఫోరం ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద భారీ దర్నా చేపట్టారు. ఈ దర్నాలో రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు, వ్యాపారులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.
kvcs

అయితే ఈ దర్నాకు ఎలాంటి అనుమతులు లేవని, పైగా దర్నాలో ఆందోళన వాతావరణం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందని భావించడంతో పాటు ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని పోలీసులు దర్నాలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు. పోలీస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అఖిలేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన తాండూరులో చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

ఆర్టీసీ బస్సు మృతులకు అంజలి..!