బీసీ న్యాయపోరాటానికి మేముసైతం..!
– తాండూరు బంద్‌కు వర్తక, వ్యాపారుల మద్దతు
– స్వాగతించిన బీసీ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల న్యాయపోరాటానికి మేముసైతం మద్దతు ఇస్తామని తాండూరు వర్తక, వ్యాపారాల సంఘాలు మద్దతు ప్రకటించాయి.

రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈనెల 18న తాండూరు బీసీ బంద్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గురువారం తాండూరు బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, ఈడ్డి శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో తాండూరు ఆర్టీసీ డీఎం సురేష్ కుమార్, ప్రైవేటు విద్యాసంస్థలు, వస్త్ర వ్యాపారులు, ది గ్రైన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్, కిరాణా అసోసియేషన్, సినిమా థియేటర్ల యజమాన్యాలను కలిసి బీసీ బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇందుకు డీపో మేనేజర్ తో పాటు ఆయా సంస్థలు, వ్యాపారులు బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బీసీల న్యాయపోరాటంలో భాగస్వాములం అవుతామని అన్నారు. దీంతో బీసీ సంఘం నాయకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, టీవీవీ నాయకులు పర్యాద రామకృష్ణ, లక్ష్మణ చారి, శివకుమార్, పరమేష్, విజయలక్ష్మీ, నర్సమ్మ, మంజుల, వివేక్, కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

