శబరిమళైకి అయ్యప్ప స్వాములు..!
– తాండూరు నుంచి మహా పాదయాత్ర
– ప్రారంభించిన డా.సంపత్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి అయ్యప్ప స్వాములు మహా పాదయాత్రగా బయల్దేరారు. శుక్రవారం Com నుంచి పాదయాత్ర చేపట్టారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రతి యేడాది పాదయాత్ర చేపడుతున్నారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా బయల్దేరే ఆనవాయితిని పాటిస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు Net నుంచి శబరిమళైకి పాదయాత్రగా బయల్దేరారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి స్వాములు పాదయాత్ర చె పట్టారు. అంతకుముందు దేవాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నుంచి పాదయాత్రగా బయల్దేరారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు డా. సంపత్ కుమార్ హాజరై పాదయాత్రను జెండా ఊపిప్రారంభించారు.

అయ్యప్ప స్వామికి కీర్తిస్తూ స్వాములు ముందుకు సాగారు. తాండూరు నుంచి బయల్దేరిన పాదయాత్ర సుమారు 40రోజుల పాటు కొనసాగుతుందని స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప ట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, పలువురు స్వాములు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు ఉన్నారు.
శబరిమలకు ‘పెరుమాళ్ల’ పాదయాత్ర
– పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ) ఆపిల్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్) మరియు నమస్తే తెలంగాణ తాండూరు డివిజన్ రిపోర్టర్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి శుక్రవారం తాండూరు నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరాడు.

సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు 1190 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యఫలితంగా అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే అదృష్టం వచ్చిందన్నారు. తాను, తన కుటుంబం, బంధుమిత్రులతో పాటు తాండూర్ నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా కాలినడకన శబరిమలకు వెళ్లడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. క్రమశిక్షణ, సంకల్పం పెంపొందించుకోవడం, భక్తిభావన పెరగడం, ఆత్మజ్ఞానం సంపాదించడం వంటివి ఉన్నారు. ప్రకృతితో మమేకమయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు. యాత్రలోని కష్టాలను సహిస్తూ ముందుకు సాగడం వల్ల భగవంతునిపై భక్తి, సంకల్పం బలపడతాయన్నారు.

ఇదికూడా చదవండి…

