రైస్ మిల్లర్లు మొండి వైఖరి వీడాలి
– కేంద్రాల ధాన్యం తీసుకోకుంటే చర్యలు తప్పవు
– తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ధాన్యం దిగుమతిలో రైస్ మిల్లర్లు మొండి వైఖరిని మానుకోవాలని లేదంటే తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ రైతులు పండించిన ధార్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంటే రైస్ మిల్లర్లు కోర్రీలు పెట్టడం సరికాదన్నారు. కేంద్రాల నుంచి రైతులు ధాన్యం మిల్లర్లకు వద్దకు తీసుకవస్తే నిర్వహకులు తీసుకోకపోవడం మంచి పద్దతి కాదన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం తీసుకోకుండా మొండికేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే మిల్లర్ల లైసెన్స్‌లను రద్దు చేసి సీజ్ చేయిస్తామన్నారు. కావున రైతులను ఇబ్బందులకు గురిచేయండా ధాన్యంను దిగుమతి చేసుకోవాలని అన్నారు.

