పెద్దేముల్ నుంచి మా గ్రామాన్ని విడదీయొద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

పెద్దేముల్ నుంచి మా గ్రామాన్ని విడదీయొద్దు
– తాండూరు ఎమ్మెల్యేకు నర్సాపూర్ గ్రామస్తుల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం నుంచి మా గ్రామాన్ని విడదీయోద్దని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని నర్సాపూర్ గ్రామస్తులు కోరారు. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల తట్టెపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తట్టెపల్లిలో నర్సాపూర్ గ్రామాన్ని విలీనం చేస్తున్నారని తెలిసి గ్రామస్తులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు.

తట్టెపల్లీకి నర్సాపూర్ గ్రామానికి మద్య 12 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. మండల కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు ఆటో, బస్సు సౌకర్యం కూడా ఉండదని వివరించారు. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావల్సి వస్తుంది అని తెలిపారు. అదే పెద్దేముల్ కేవలం 5 కిలోమీటర్లు అవుతుందని, గ్రామ ప్రజలు వెళ్లేందుకు వీలుగా వుంటుంది అని తెలిపారు. గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామాన్ని పెద్దెముల్ మండలం లోనే కొనసాగించాలని, తట్టెపల్లిలో కలపొద్దని కోరారు.

ఇదికూడా చదవండి…

శబరిగిరీషుని చెంత తాండూరు స్వాములు..!