బస్సు ఢీకొని బస్సు మెకానిక్ మృతి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బస్సు ఢీకొని బస్సు మెకానిక్ మృతి
– పరిగి ఆర్టీసీ డీపోలో దుర్ఘటన
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : బస్సు ఢీకొని బస్సు మెకానిక్ దర్మరణం చెందారు. ఈ సంఘటన పరిగి ఆర్టీసీ డిపోలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

డిపోలో కుద్దూస్ (Kuddus) (56) డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. డిపో నుండి బయటకు వస్తున్న బస్సుకు బ్రేక్ (Bus brake) పనిచేయకపోవడంతో అది ముందు నిలబడి ఉన్న కుద్దూస్‌ను ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొనడంతో కుద్దూస్ తలకు తీవ్ర గాయాలు కాగా, సంఘటనా స్థలంలోనే మరణించారు.
kvcs
ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉండగానే డిపార్ట్మెంట్‌లోనే ప్రాణాలు కోల్పోవడం డిపో సిబ్బందిని కలచివేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదికూడా చదవండి…

రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం