యాదవ బిడ్డకు ఎమ్మెల్యే అవకాశం అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

యాదవ బిడ్డకు ఎమ్మెల్యే అవకాశం అభినందనీయం
– తెంలగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
– కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల నిబద్ధతను చాటుకునేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం అభినందనీయమని తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు, యాదవ సంఘం సభ్యులు, సీనీయర్ న్యాయవాది డి. నర్సింగ్‌ రావు అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మా యాదవ బిడ్డను అసెంబ్లీకి పంపే అవకాశం కల్పించినందుకు, మా యాదవ సమాజం తరఫున మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలోని ప్రతి BC బిడ్డకు న్యాయం జరుగుతుందని బలమైన నమ్మకం ఏర్పడింది. గత ప్రభుత్వాల్లో బీసీలకు లభించని న్యాయం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని అన్నారు.
kvcs
BCలకు 42% రిజర్వేషన్‌ను అందించి, అది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవంలో అమలు చేయాలన్న సంకల్పంతో, మా BC బిడ్డ నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ప్రజలతో కలిసి ఆయనను విజయం వైపు నడిపించడం… అనంతరం అసెంబ్లీకి ఆహ్వానించడం.. పలు అంశాలు బీసీల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ఆదరణకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాల్లో బీసీలకు లభించని న్యాయం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తప్పకుండా లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ సముచిత న్యాయం జరుగుతుందని, సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తామని, తెలంగాణను భారతదేశంలోనే అత్యంత సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని ముఖ్యమంత్రి గారి నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది అని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇందిరమ్మ ఇంటికి మరో రూ.లక్ష