పార్టీతో పాటు ప్రజల కోసం పనిచేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్టీతో పాటు ప్రజల కోసం పనిచేయండి
– బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని కలిసిన అప్పూ (నయూం)
– శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ బలో పేతంతో పాటు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనీయర్ నాయకులు అఫ్పూ(నయూం) తన అనుచరులతో కలిసి బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలన్నారు.

పార్టీ బలో పేతానికి పాటుపడాలన్నారు. అనంతరం అప్పూ(నయూం) మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సొంతగూటికి చేరుకున్నట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో శ్రీనివాస్ రెడ్డితో కలిసి పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, హరిహర గౌడ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నారా లోకేష్, వంశీ, అబుబకార్, బాల్ రాజ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఇష్టంతో కసిగా చదివితేనే విజయం..!