ఇష్టంతో కసిగా చదివితేనే విజయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇష్టంతో కసిగా చదివితేనే విజయం..!
– ప్రభుత్వ విద్యార్థులే ఉద్యోగాలు సాధిస్తున్నారు
– గ్రూప్ -1 ర్యాంకర్, కొత్త ఎంపీడీఓ కుర్వ క్రాంతి
– తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఘనంగా సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇష్టంతో కసిగా చదివితేనే అందరికి విజయం సొంతం అవుతుందని తాండూరు గ్రూప్ -1 ర్యాంకర్ కుర్వ క్రాంతి కుమార్ అన్నారు. తాండూరు పట్టణంకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ కుమారుడు కుర్వ క్రాంతి గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభకనబరిచి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎంపీడీఓగా విధులు చేపట్టారు.

ఈ సందర్భంగా శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకుల ఆధ్వర్యంలో కుర్వ క్రాంతిని ఘనంగా సన్మానించారు. నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ కుర్వ క్రాంతిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ కాలేజీలు, బడులలో చదివే విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అదేవిధంగా కుర్వ క్రాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువున్న పేద విద్యార్థులే ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారని అన్నారు.

ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండడం నిదర్శనమన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో కసిగా చదువుకుంటే నిర్దేశించుకున్న లక్ష్యాలలో విజయాలు సొంతం అవుతాయన్నారు. విద్యార్థులు గ్రూప్స్ లో రాణించి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ మళ్లినాథప్ప, అద్యాపకులు మల్లయ్య, మహేందర్, కిష్టప్ప, నీలప్ప, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, గోవర్దన్, వెంకట్ స్వామి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు..!