ఇంటి నుంచే రెవెన్యూ సేవలు…!

జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

ఇంటి నుంచే రెవెన్యూ సేవలు…!
– 38 విభాగాల నుంచి 580 సేవలు
– ఈ నెంబర్‌ ఒక్కటి సేవ్ చేసుకుంటే చాలు
– ఎలా పనిచేస్తుందంటే.. తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వంలోని రెవెన్యూ శాఖ నుంచి పేదలకు సేవలు పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగి అవస్థలు పడాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితలు ఒక్కొక్కటికి మారుతున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి పొందాల్సిన సేవలు ఇంటి నుంచే పొందే ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఒక్కటి కాదు.. రెండు కాదు.. 38 విభాగాలకు సంబంధించిన 580 సేవలను ఇంటి నుంచే పొందే వీలును కల్పించింది. దీని కోసం ఏం చేయాల్సిన పనిలేదు. మీ వాట్సాప్‌లో వాట్సప్‌ నంబరు 80969 58096ను సేవ్ చేసుకుంటే చాలు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

అందే సేవలు ఇవే…
ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ‘మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సప్‌’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘మీ సేవ’ సెంటర్ల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఈ కేంద్రాల ద్వారా అందించే సేవలు స్మార్ట్‌ఫోన్ ద్వారా నేరుగా వాట్సప్‌లో అందుబాటులో ఉంటాయి. ఇంట్లో కూర్చుని కుల, ఆదాయ, నివాస, జనన, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్‌ వంటి అన్ని రకాల అప్లికేషన్స్​ కోసం ఫోన్‌ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. నీటి, విద్యుత్తు, ఆస్తి పన్ను, ఆర్టీఏ, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, తదితర పౌరసరఫరాలు, దేవాలయాల సేవలు కూడా పొందవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే..?
: ముందుగా అధికారిక మీ సేవ వాట్సప్‌ నంబరును మొబైల్​లో ‘సేవ్‌’ చేసుకోవాలి. ఆ నంబర్ కు ‘మెనూ’ ఆప్షన్ టైప్ చేసి పంపిస్తే అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది. ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన దానిని ఎంపిక చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు, స్కాన్‌ చేసిన ప్రతులను వాట్సప్‌లోనే అప్‌లోడ్‌ చేయవచ్చు. ఆ తర్వాత ఫీజును ఆన్​లైన్​ పేమెంట్‌ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు.

స్టేటస్ తెలుసుకునే అవకాశం
దరఖాస్తు స్టేటస్​, నవీకరణలను సేవ్​ చేయడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు సంక్షిప్త సందేశాల రూపంలో వస్తాయి. దరఖాస్తు స్టేటస్, అప్‌డేట్స్‌ అన్ని ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశం రూపంలో వస్తాయి. సర్టిఫికెట్‌ లేదా డాక్యుమెంట్‌ సిద్ధం కాగానే దాని డౌన్‌లోడ్‌ లింక్‌ నేరుగా వాట్సప్‌లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ సేవలు ఇంగ్లీష్​లో అందుబాటులో ఉండగా, మరికొద్ది రోజుల్లోనే తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఈ సేవలు అందనున్నాయి.

ఇదికూడా చదవండి…

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం