పంచాయతిలో జాక్ పాట్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

పంచాయతిలో జాక్ పాట్..!
– ఒకే ఇంటికి కలిసోచ్చిన రిజర్వేషన్
– సర్పంచ్‌, వార్డు సభ్యుల పోటీకి చాన్స్
– వికారాబాద్‌ జిల్లాలో ఆసక్తికరం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో పంచాయతి రిజర్వేషన్‌ ఓ కుటుంబానికి కలిసొచ్చింది. ఒకే ఇంటిలో సర్పంచ్‌ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఈ సంఘటన జిల్లాలో ఆసక్తికరంగా మారింది.

వికారాబాద్ బషీరాబాద్ మండలం మంతన్‌ గౌడ్ గ్రామానికి పంచాయతి ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో పాటు రెండు వార్డులు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయ్యింది. గ్రామం లో 494 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్నాయి.

అయితే గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం ఒక్కటే ఉంది. దీంతో సర్పంచ్ పదవితోపాటు ఎస్టీ(జనరల్), ఎస్టీ(మహిళ) వార్డు స్థానాలు కూడా ఆ కుటుంబంలోని ముగ్గురికి దక్కబోతున్నాయి. ఎరుకలి భీమప్ప తన భార్య వెంకటమ్మతో కలిసి గ్రామంలో బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇద్దరు కొడుకులు ఎల్లప్ప, మహేశ్, కోడళ్లు స్వప్న, సుజాత పిల్లలతో నగరంలోని చందానగర్ లో ఆటోలు నడుపుతున్నారు. పంచాయతీ ఎన్నికలు వారి కుటుంబ పరిస్థితులను మార్చబోతున్నాయి. ఈ ఆసక్తికర ఘటన చర్చనీయాంశమైంది.

ఇదికూడా చదవండి…

పల్లె పోరుకు మోగిన నగారా..!