పదో తరగతి పరీక్షల టైం టేబుల్ మార్చాలి
– నెల రోజుల షెడ్యూల్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువ
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ మార్చాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ వచ్చే మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేది వరకు పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించడాన్ని గుర్తుచేశారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పదో తరగతిలో ఉండే 7 పరీక్షలకు నెల రోజులు (33రోజులు) ఎందుకు అని ప్రశ్నించారు. పరీక్షలకు మద్య సుమారు 3 నుంచి 5 రోజులు సెలువులు రావడం విద్యార్థుల పరీక్షలపై లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని, దీనిపై రాష్ట్రంలోని ఇంటలెక్చువల్, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

అంతేకాకుండా పరీక్షల మద్య ఉన్న రోజులను విద్యార్థులు సెలవుల్లా భావించే అవకాశం ఉందని, దీని వల్ల విద్యార్థుల ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు. దీనికి తోడూ ఏప్రిల్ మాసంలో వేసవి తీవ్రత వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురికావచ్చని అన్నారు. కావున పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ను సవరించి ఒక్కొక్క రోజూ గ్యాపుతో 15 రోజుల్లో పరీక్షలు ముగిసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదికూడా చదవండి…

